సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో పులివెందులను.. పూర్తి స్థాయిలో అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ మనోహర్ రెడ్డిలు పేర్కొన్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 33కి 33 కౌన్సిలర్లు, ఛైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇడుపులపాయ చేరుకొని.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ఘాట్‌లో రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు.
'సీఎం సహకారంతో పులివెందుల పురోగతికి కృషి చేస్తా'
సీఎం జగన్ ఆధ్వర్యంలో పులివెందుల మున్సిపాలిటీని.. అభివృద్ధిపథంలో నడిపిస్తామని ఏకగ్రీవమైన ఛైర్మన్ వరప్రసాద్, వైస్ ఛైర్మన్ మనోహర్ రెడ్డిలు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళి సమర్పించారు.
సీఎం సహకారంతో పులివెందుల పురోగతికి కృషి చేస్తాను