ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం - కడప నేటి వార్తలు

అనారోగ్యంతో మృతి చెందిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని కడప జిల్లా ఎస్పీ అందజేశారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు.

Provision of financial assistance to the families of deceased constables in kadapa
మృతి చెందిన కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

By

Published : Aug 26, 2020, 5:30 PM IST

అనారోగ్యంతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ భరోసా ఇచ్చారు. కడపలో పని చేస్తున్న వరప్రసాద్, ఇస్మాయిల్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

వీరి కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. పోలీసు సిబ్బంది.. తమ ఆరోగ్యాలపై శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details