నివాసాల మధ్య కరోనా బాధితుల వార్డును ఏర్పాటు చేయడం మానుకోవాలంటూ కడపలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. కడప మహిళా సాధికారత శిక్షణ కేంద్రం ప్రాంగణంలో కరోనా వార్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నట్లు తెలియడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య ఇలాంటి వార్డులు ఏర్పాటు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. అధికారులు వెంటనే వార్డును తొలగించాలని కోరుతున్నారు.
'నివాసాల మధ్య కరోనా వార్డు వద్దు' - కరోనా వార్తలు కడపలో
కరోనా బాధితుల వార్డును జనావాసాల మధ్య ఏర్పాటు చేయటంపై కడప జిల్లా ప్రజలు ఆందోళ చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వార్డు ఏర్పాటును నిలిపివేయాలంటూ నిరసనలు చేశారు.
Protests for the corona ward between residences at kadapa district