ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరుతూ శవంతో నిరసన - Concern of Korrapadu resettlement colonists news

కడప జిల్లా కొండాపురం మండలం కొర్రపాడు పునరావాస కాలనీ ప్రజలు ఆందోళనకు దిగారు. కాలనీకి శ్మశాన స్థలం కేటాయించాలని డిమాండ్​ చేస్తూ శవంతో ఆందోళన చేపట్టారు.

Protest
శవాన్ని రోడ్డుపై ఉంచి నిరసన

By

Published : Jan 4, 2021, 3:13 PM IST

Updated : Jan 4, 2021, 3:19 PM IST

కొండాపురం మండల సమీపంలో కొర్రపాడు పునరావాస కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేవంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్లుగా శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరినా అధికారులు పట్టించుకోవటం లేదని నిరసన వ్యక్తం చేశారు. శవాన్ని రోడ్డుపై ఉంచి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఇతర పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడుతున్నారు.

శ్మశానానికి స్థలం కేటాయించాలని కోరుతూ కొర్రపాడు పునరావాస కాలనీవాసుల ఆందోళన
Last Updated : Jan 4, 2021, 3:19 PM IST

ABOUT THE AUTHOR

...view details