కడప చిన్నచౌకు పరిధిలోని సర్వేనంబరు 426లో ఉన్న ఎకరం ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న సీపీఐ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు మద్దతు తెలిపారు. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన అధికారులే... ఆక్రమణ దారులకు అండగా నిలుస్తున్నారని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయల విలువైన స్థలాలను ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే ఈ స్థలానికి కంచె ఏర్పాటు చేయాలని నిరసనకారులు కోరుతున్నారు.
ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై స్థానికుల నిరసన - kadapa news today
కడప జిల్లాలో కొందరు అధికార పార్టీ నాయకుల అండతో ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురువుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేదలు నిర్మించుకున్న ఇళ్లను సైతం కూలగొట్టి కబ్జా చేసేందుకు ఆక్రమణ దారులు యత్నిస్తుండగా... కమ్యూనిస్టు నాయకులు అడ్డుకున్నారు. ఆక్రమణదారులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై స్థానికుల నిరసన