కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. గత 5 రోజులుగా పరిహారం కోసం ముంపువాసులు ఆందోళన చేస్తున్నారు. గండికోట నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. తాళ్ల పొద్దుటూరు ఎస్సీ కాలనీలో గండికోట నీరు చేరడంతో వీలైనంత త్వరగా వారిని ఖాళీ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు ఆ గ్రామానికి చేరుకుని నిర్వాసితులతో మాట్లాడుతున్నారు. గ్రామంలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు అక్కడ 144 సెక్షన్ విధించారు.
గండికోట ముంపు నిర్వాసితులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం - protest of Gandikota flood victims at Thalapproddutur
కడప జిల్లా తాళ్లప్రొద్దుటూరులో గండికోట ముంపు నిర్వాసితుల ధర్నా చేపట్టారు. 5 రోజులుగా వీరు పరిహారం కోసం ధర్నా చేస్తున్నారు. నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు భారీగా పోలీసులు తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తాళ్లప్రొద్దుటూరులో ఉద్రిక్తత
Last Updated : Sep 8, 2020, 10:24 AM IST