కడప పారిశ్రామికవాడలోని కొన్ని పరిశ్రమలు కాలుష్యాన్ని వెదజల్లుతున్నా... కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ అంశంపై సింగపూర్ టౌన్షిప్ కాలనీ వాసులు గతంలోనే అధికారులకు ఫిర్యాదు చేయగా.. పట్టించుకోకపోవటంతో నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద నిరసన చేశారు. పరిశ్రమల యజమానులతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కుమ్మక్కయ్యారని నిరసనకారులు ఆరోపించారు.
'కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలి' - kadapa latest news
కడపలో స్థానిక సింగపూర్ టౌన్షిప్ కాలనీ వాసులు ఆందోళన చేశారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ... కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు.

కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయంలో నిరసన