ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించండి' - కడప నేటి వార్తలు

కడపలో ఏఐటీయూసీ నేతలు ఆందోళన చేశారు. ఆంధ్రప్రగతి బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

protest-in-kadapa-to-demand-regularization-of-temporary-employs-in-andhra-pragathi-bank
కడపలో నిరసన

By

Published : Oct 14, 2020, 7:48 PM IST

ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ... కడపలో ఏ.ఐ.టీ.యూ.సీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. బ్యాంకు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బ్యాంకులో ఇటీవల చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ అంశం గురించి బ్యాంకు ఛైర్మన్ దృష్టికి తీసుకెళ్లినా... పట్టించుకోలేదన్నారు. పొరుగు సేవల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details