ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్వారంటైన్ కేెంద్రంలో నీటి కష్టాలు... ఖాళీ క్యాన్​లతో నిరసన - quarentin news in kadap ds produtur

కడప జిల్లా ప్రొద్దుటూరు క్వారంటైన్ కేంద్రంలో బాధితులు నిరసన చేశారు. నీటి కొరతవల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని ఖాళీ నీటి క్యాన్లతో నిరసన చేశారు.

protest in kadapa dst produttur due to scarcity of water
protest in kadapa dst produttur due to scarcity of water

By

Published : May 1, 2020, 8:41 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు ప్ర‌భుత్వ ప‌శువైద్య కళాశాల‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో తాగు నీటి స‌మ‌స్య ఉంది. తాగేందుకు నీరు లేక‌పోవ‌డంతో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నామంటూ... ఖాళీ నీటి క్యాన్ల‌తో క్వారంటైన్‌లో నిర‌స‌న తెలిపారు. ప్ర‌తి రోజూ ఆటో ద్వారా నీటిని క్వారంటైన్‌కు స‌ర‌ఫ‌రా చేసేవారు. ఆ ఆటోను పోలీసులు అడ్డుకోవ‌డంతో నీరు స‌ర‌ఫ‌రా కాలేదు. దీంతో క్వారంటైన్‌లోని వ్య‌క్తులు తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. నీటిని స‌రఫ‌రా చేసే ఆటోను కూడా పోలీసులు అడ్డుకోవ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details