ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కాకపోవడానికి.. కారణం ఇదే: డీఎల్ - కడప ఉక్కు పరిశ్రమ కోసం రిలే నిరాహార దీక్షలు

Kadapa steel plant: కడపలో ఉక్కు పరిశ్రమ కోసం.. పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మూడేళ్ల నుంచి ఉక్కు పరిశ్రమ ముందుకు సాగట్లేదంటూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఆందోళన చేపట్టారు.

protest for Kadapa steel plant
కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కాకపోవడానికి వాటాలు అడుగుతున్నారు: డీఎల్

By

Published : Mar 21, 2022, 12:38 PM IST

Kadapa steel plant: కడప ఉక్కు పరిశ్రమ కోసం.. పోరాట కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఈ దీక్షలు ప్రారంభించారు. మూడేళ్ల నుంచి ఉక్కు పరిశ్రమ ముందుకు సాగట్లేదంటూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ఆర్థికి పరిస్థితి పతనావస్థకు చేరిందన్న డీఎల్.. ఇపుడు ప్రభుత్వానికి అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని విమర్శించారు.

పరిశ్రమ నిర్మాణం కాకపోవడానికి వాటాలు అడుగుతున్నారని తెలుస్తోంది. ఓ పెద్ద వ్యక్తి 25 శాతం వాటా అడుగుతున్నట్లు తెలిసింది. జిల్లాలో నిరుద్యోగులు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంతో ప్రజల జీవన విధానం దెబ్బతింటుంది. -డీఎల్‌ రవీంద్రారెడ్డి

వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది..
వివేకా హత్యకేసులో నిందితులకు ఖచ్చితంగా శిక్ష పడుతుందని డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. సీబీఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందన్న ఆయన.. నిందితులను ఎవరు వెనకేసుకొస్తున్నారో అందరికీ తెలుసన్నారు. వివేకా కుమార్తె, అల్లుడిని ఇరికించేందుకు యత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.

వివేకాను ఎవరు హత్య చేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వివేకా హత్యకు ఉపయోగించిన కోట్ల రూపాయలు ఎక్కడివి? డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అనే దానిపై సీబీఐ విచారణ చేస్తోంది. -డీఎల్‌ రవీంద్రారెడ్డి

ఇదీ చదవండి:పెచ్చుమీరుతున్న అధికారుల అరాచకాలు..డిపాజిట్​ కట్టలేదని కుళాయి గొట్టాలకు బిరడాలు..!

ABOUT THE AUTHOR

...view details