కానపల్లె ఎస్సీ కాలనీ వాసులు.. ఓ మృత దేహంతో కడప జిల్లా ప్రొద్దుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. శ్మశాన వాటిక ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. శ్మశానం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా తహసీల్దార్ నజీర్ అహ్మద్‌ను కోరారు. ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.