అంత్యక్రియలు, శుభకార్యాలకు పరిమిత సంఖ్యలో జనాన్ని అనుమతిస్తున్న ప్రభుత్వం.. మద్యానికి వేలాది మందికి ఎలా అనుమతిచ్చారో చెప్పాలంటూ తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలతో కలిసి తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోవడంతో వైరస్ విస్తరించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు మాజీముఖ్యమంత్రి చంద్రబాబు ఇస్తున్న సలహాలను స్వీకరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మద్యం కొనుగోలుకు ఎలా అనుమతిచ్చారు'..? - కడప నేటి వార్తలు
రాష్ట్రంలో మద్యం దుకాణాలు తెరవడంపై తెదేపా రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెళ్లిల్లు, అంత్యక్రియలకు పరిమిత సంఖ్యలో జనాలను అనుమతిస్తున్న ప్రభుత్వం... మద్యం కొనుగోలుకు వేలాదిగా అనుమతివ్వడం ఏమిటని ప్రశ్నించారు.
!['మద్యం కొనుగోలుకు ఎలా అనుమతిచ్చారు'..? protest against to opening wine shops in andhra pradhesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7096065-656-7096065-1588844040846.jpg)
తహసీల్దార్‌కు వినతి పత్రం అందిస్తున్న నేతలు