భవిష్యత్తులో వ్యవసాయం సక్రమంగా సాగాలంటే వర్షపునీటిని భూమిలోకి ఇంకింపచేసి... భూగర్భ జలాలను కాపాడుకోవాలని జిల్లా సూక్ష్మ నీటి సాగు పథకం ఏపీడీ రవీంద్రబాబు పిలుపునిచ్చారు. కడప జిల్లా రాజంపేట మండలం బ్రాహ్మణపల్లిలో సూక్ష్మ నీటి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయి... వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.
'భూగర్భ జలాలను కాపాడండి... భావితరాలకు అందించండి' - Protect Groundwater Provide posters
సూక్ష్మ నీటి సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని కడప జిల్లా బ్రాహ్మణపల్లిలో ఏపీడీ రవీంద్రబాబు అధ్యక్షతన నిర్వహించారు.

'భూగర్భ జలాలను కాపాడండి...భావితరాలకు అందించండి'
రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏపీడీ రవీంద్రబాబు
ఉద్యాన పంటల సాగులో డ్రిప్ ద్వారా నీటిని అవసరం మేరకు మొక్కలు వయసును బట్టి అందించడం వల్ల 40 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చని వివరించారు. డ్రిప్ ద్వారా పంటలకు నీరు అందించే సమయంలో రైతుల పర్యవేక్షణ ముఖ్యమని చెప్పారు. ఏ పంటకు ఎంత నీరు అవసరమో తెలుసుకొని... నీటి యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా భావితరాలకు భూగర్భ జలాలను అందించినవారు అవుతారని తెలిపారు.
ఇవీ చదవండి....ప్రకృతి ఒడిలో.. పచ్చని పల్లె
TAGGED:
కడప జిల్లా