నిర్మాత బండ్ల గణేశ్‌కు మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. నవంబర్ 4 వరకు రిమాండ్ విధించిన కడప ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు... చెక్ బౌన్స్ కేసులో ఈ నిర్ణయం తీసుకుంది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మహేశ్ అనే వ్యక్తికి రూ.20 లక్షలు బండ్ల గణేశ్ బకాయిపడ్డాడు. రూ.20 లక్షల చెక్ బౌన్స్ కావడంతో మహేశ్ కడప కోర్టును ఆశ్రయించారు. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీతో... నిన్న రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండ్ల గణేశ్‌ను కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నారు. కాగా... బండ్ల గణేశ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.ప్రస్తుతం మహేశ్ రెండు విడతలుగా ఇచ్చిన 20 లక్షల రూపాయల్లో... పది లక్షల రూపాయలకు కోర్టు సమన్లు జారీ చేయడంతో రిమాండు విధించారని మహేశ్ తరపు న్యాయవాది షేక్ గౌస్ తెలిపారు.
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు రిమాండ్ - సినీ నిర్మాత బండ్ల గణేష్ తాజా వార్తలు
సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు కడప ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. నాన్‌బెయిల్‌బుల్ వారెంట్ జారీతో... బండ్ల గణేశ్‌ను నిన్న రాత్రి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
![సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు రిమాండ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4853220-33-4853220-1571899306871.jpg)
కోర్టుకు హాజరైన బండ్ల గణేశ్
Last Updated : Oct 24, 2019, 3:32 PM IST