ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

road washed away: రహదారి కోత... నిత్యం వెత - roads washed away at kadapa

కడప జిల్లా ప్రొద్దుటూరు - ఆర్టీపీపీ మార్గమధ్యంలో పెన్నానదికి వదిలిన నీటి ప్రవాహ ఉద్ధృతికి రోడ్డు కోతకు గురైంది. సిరిగేపల్లె, పెద్దదండ్లూరు తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు ఇదే ఆధారం.

road washed away
road washed away

By

Published : Sep 8, 2021, 11:12 AM IST

కోతకు గురైన రోడ్డు

కడప జిల్లా ప్రొద్దుటూరు - ఆర్టీపీపీ మార్గమధ్యంలో రోడ్డు కోతకు గురైంది. మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి వదిలిన నీటి ప్రవాహ ఉద్ధృతికి జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె-పెద్దదండ్లూరు రహదారి కొట్టుకుపోయింది. సిరిగేపల్లె, పెద్దదండ్లూరు తదితర గ్రామాల ప్రజల రాకపోకలకు ఇదే ఆధారం. వాహనాలు అటు వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గత ఏడాదిన్నర క్రితం అదే స్థానంలో మట్టికట్ట కొట్టుకుపోగా 13 లక్షలతో ఆర్టీపీపీ అధికారులు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేశారు. మట్టితో ఏర్పాటుచేసిన ఆ రోడ్డు మళ్లీ కోతకు గురైంది.

రహదారి కోతకు గురైన ప్రతిసారి ప్రజలు, విద్యార్థులు జమ్మలమడుగుకు రాకపోకలకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. రహదారి సమస్య పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

RAINS : ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు... మునిగిన ఏజెన్సీ..

ABOUT THE AUTHOR

...view details