కడప జిల్లా ప్రొద్దుటూరులో లాక్‌డౌన్ కొనసాగుతోంది. పోలీసులు ఎక్కడిక్కడికే రహదారులను దిగ్బంధించారు. డీఎస్పీ సుధాకర్ సహా సీఐలు, ఎస్సైలు, సిబ్బంది రోడ్లపైకి వచ్చి వాహనదారులను అడ్డుకున్నారు. అవసరం లేకున్నా బయట తిరుగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పట్టణంలో కొందరు యువకులు తిరుగుతుండగా.. వారితో నడి రోడ్డుపైనే గుంజీలు తీయించారు. వాహనాలపై ఎవరూ తిరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని డీఎస్పీ సుధాకర్.. ప్రజలను కోరారు.
లాక్డ్న్ : బయటకు వస్తే గుంజీలే - కడపలో లాక్‌డౌన్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రొద్దుటూరులో అవసరం లేకుండా ఎవరైనా బయటకు వస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు.

prodhuturu police strictly following lockdown in kadapa
TAGGED:
కడపలో లాక్‌డౌన్