ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్వీయూ పీజీసెట్ ఫలితాల్లో ప్రొద్దుటూరు విద్యార్థుల ప్రతిభ - proddurooru news updates

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నిర్వహించిన పీజీ సెట్ పరీక్షా ఫలితాల్లో కడప జిల్లా ప్రొద్దుటూరు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంఎస్సీ మ్యాథ్స్​లో అనోహన్ 40వ ర్యాంకు, ఎంఎస్సీ ఫిజిక్స్​లో హసీనా 58వ ర్యాంకు సాధించారు.

proddurooru student get best ranks in SVU pg cet results
ఎస్వీయూ పీజీసెట్ ఫలితాల్లో ప్రొద్దుటూరు విద్యార్థుల ప్రతిభ

By

Published : Oct 16, 2020, 9:59 PM IST

తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర విశ్వవిద్యాల‌యం నిర్వ‌హించిన పీజీ సెట్ ప‌రీక్షా ఫ‌లితాల్లో... క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరు విద్యార్థులు స‌త్తా చాటారు. ప‌ట్ట‌ణంలోని వేదవ్యాస డిగ్రీ క‌ళాశాల‌కు చెందిన అనోహ‌న్.. ఎంఎస్సీ మ్యాథ్స్​లో 40వ ర్యాంకు, ఎంఎస్సీ ఫిజిక్స్​లో హసీనా 58వ ర్యాంకు, అఖిల ల‌క్ష్మి 135వ ర్యాంకు, విన‌య్‌కుమార్ 254వ ర్యాంకు, దినేష్ 396వ ర్యాంకు, నాగేష్ 568వ ర్యాంకులు సాధించార‌ని క‌ర‌స్పాండెంట్ నాగేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు. త‌ల్లిదండ్రులు, అధ్యాప‌కుల స‌హ‌కారంతోనే ఉత్త‌మ ర్యాంకులు సాధించ‌గ‌లిగామ‌ని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. భ‌విష్య‌త్తులో మంచి ఉద్యోగాలు సాధించి త‌ల్లిదండ్రుల‌కు అండ‌గా నిలుస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా వారిని క‌ళాశాల యాజమాన్యం, కుటుంబ స‌భ్యులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details