నివర్ తుపాను వల్ల నష్టపోయిన రైతుల కోసం తన వంతుగా రూ.కోటి ఇవ్వనున్నట్లు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రకటించారు. రాజుపాలెం మండలం కుమ్మరపల్లెలో ఆదివారం రైతులతో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజాప్రతినిధిగా తనకు నెలకు రూ.2 లక్షలు జీతం వస్తుందని.. 45 నెలల పదవి కాలానికి జీతంగా రానున్న రూ.90 లక్షలకు తోడు మరో రూ.10 లక్షలు కలిపి మొత్తంగా రూ.కోటి ప్రొద్దుటూరు నియోజకవర్గ రైతులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. ఇతర ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు కూడా అన్నదాతలను ఆదుకునేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
ప్రొద్దుటూరు రైతులకు రూ.కోటి అందజేస్తా: ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి - ప్రొద్దుటూరు రైతులకు రూ.కోటి అందజేస్తానన్న ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి
నివర్ తుపానుతో నష్టపోయిన వారికి తన వంతుగా రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి