రేషన్ సాఫ్ట్‌వేర్ మార్పుతో చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాల కోసం..కడప జిల్లా వ్యాప్తంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. రోజుల తరబడి సరుకుల కోసం తిరగాల్సి వస్తోందంటున్న ప్రజలు..నూతన విధానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందున్న సాఫ్ట్‌వేర్ బాగానే పనిచేసేదంటున్న రేషన్ డీలర్లు..అప్‌డేట్ వెర్షన్‌తో సమస్యలు తలెత్తినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఒక్కోరికి అరగంటకు పైగా సమయం పడుతోందని అంటున్నారు. వెంటనే ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను మార్చాలని ప్రజలు, డీలర్లు డిమాండ్ చేస్తున్నారు..
సాఫ్ట్‌వేర్ మార్పుతో ఇబ్బందులు...రేషన్ కోసం ప్రజల ఇక్కట్లు - రేషన్ కోసం కడప జిల్లాలో ప్రజల ఇక్కట్లు
పేదలకు ప్రభుత్వం అందిస్తోన్న నిత్యావసర సరుకులు పొందాలంటే రోజుల తరబడి దుకాణాల ఎదుట పడిగాపులు కాయాల్సి వస్తోంది. రేషన్ సాఫ్ట్‌వేర్ మార్పుతో చౌకధరల దుకాణాల్లో నిత్యావసరాల కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు.
రేషన్ సాఫ్ట్‌వేర్ మార్పుతో ఇబ్బందులు