ప్రైవేటు పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని... ఏపీ ప్రైవేటు పాఠశాలల జాయింట్ యాక్షన్ కమిటీ ఛైర్మన్ జోగి రాంరెడ్డి అన్నారు. టీ.సీలు, విద్యా ధ్రువపత్రాలు లేకపోయినప్పటికీ... ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకుంటామనడం దారుణమని మండిపడ్డారు. కడప ఆర్జేడీ కార్యాలయం ఎదుట రాయలసీమ జిల్లాలకు చెందిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ధర్నా చేపట్టాయి. కరోనా కారణంగా తమ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
'ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వం వివక్ష చూపుతోంది' - కడప నేటి వార్తలు
కడపలో రాయసీమ జిల్లాల ప్రైవేటు పాఠశాలల యజనాన్యాలు ఆందోళన చేశారు. ప్రభుత్వం తమపై వ్యవహరిస్తున్న వైఖరిని ఖండించారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

కడపలో ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ఆందోళన