ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని మంత్రికి వినతి - విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తాజా వ్యాఖ్యలు

డీఎస్సీ ప్రకటన ద్వారా వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ... నిరుద్యోగులు, ప్రైవేటు విద్యాసంస్థల వ్యాయామ ఉపాధ్యాయులు కడపలో నిరసన వ్యక్తం చేశారు. హాకీ టోర్నమెంట్​ ముగింపు వేడుకలకు హాజరైన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎదుట ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు.

Private exercise teachers
కడపలో ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయుల నిరసన

By

Published : Feb 12, 2020, 7:08 PM IST

పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని మంత్రికి వినతి

కడప జిల్లా మున్సిపల్ మైదానంలో హాకీ టోర్నమెంట్​ ముగింపు వేడుకలు జరిగాయి. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా... నిరుద్యోగులు, ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కోర్టుల్లో ఉన్న కేసులు పరిష్కరించి అందరికీ న్యాయం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ నిరసనకారులకు హామీఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details