కడప కేంద్ర కారాగారంలో రాయలసీమ జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఖైదీలు వివిధ రకాల నేరాలపై శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం కారాగారంలో 750 మంది ఉన్నారు. ఖైదీలను చూసేందుకు నెలకు రెండుసార్లు, రిమాండ్ ఖైదీలను చూసేందుకు వారానికి రెండు సార్లు అనుమతిస్తారు. కరోనా కారణంగా గతేడాది మార్చి నుంచి కేంద్ర కారాగారంలో ములాఖతులు రద్దు చేశారు.
మార్చి నుంచి ఇప్పటివరకు కారాగారంలోని... తమ వారిని చూసే అవకాశం ఖైదీలకులేకుండా పోయింది. తెలియక కారాగారం వద్దకు వస్తున్న చాలా మందిని జైలు సిబ్బంది వెనక్కి పంపిస్తున్నారు. ఆప్తులను కలుసుకోలేక అటు ఖైదీలు... ఇటు వారి బంధువులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.