కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న కేశవయ్య అనారోగ్యంతో కారాగారంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్ కు తరలించారు. అనంతపురానికి చెందిన కేశవయ్య హత్య కేసులో కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తీవ్ర అనారోగ్యానికి గురై తాను ఉంటున్న సెల్లోనే మృతి చెందాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో వెంటనే మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన బంధువులకు తెలియజేశారు. తహసీల్దార్ సమక్షంలో శవపరీక్ష నిర్వహించి... మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
కడప కేంద్ర కారాగారంలో అనారోగ్యంతో ఖైదీ మృతి - కడప కేంద్ర కారాగారంలో ఖైదీ మృతి
కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న వ్యక్తి అనారోగ్యంతో కారాగారంలోనే మృతి చెందాడు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న నిందితుడు మృతి