పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న తమను నూతన నోటిఫికేషన్లో కొనసాగించాలని కోరుతూ... రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నంలోని మంత్రి నివాసంలో వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు.
మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో 26 కేంద్రాలు విధులు నిర్వహిస్తుండగా వాటిలో 29 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, 49 మంది ఏఎన్ఎంలు, 26 మంది స్టాఫ్ నర్సులు, 22 మంది ఫార్మాసిస్టులు, ఆరుగురు ఫ్రంట్ డెస్క్ ఆపరేటర్లు, 27 మంది ఆయాలు నాలుగున్నరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నట్టు యూనియన్ గౌరవ అధ్యక్షురాలు పి.మణి వివరించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది కోసం విడుదల చేయనున్న నోటిఫికేషన్లో ప్రస్తుత సిబ్బందిని కొనసాగించాలని మంత్రికి విన్నవించారు.
కడపలో...