అట్లూరు క్రాస్ రోడ్డులోని అయ్యప్ప దేవస్థానం వద్ద గుర్తు తెలియని ఓ సాధువు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల కిందట కడప నుంచి నడుచుకుంటూ వచ్చిన ఆయన నాలుగవ రోజు శవంగా మారాడు. సాధువు స్వస్థలం తమిళనాడు రాష్ట్రంలోని మధుర అని ఆయన చెప్పినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనకు సంబంధించి అట్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అట్లూరులో గుర్తు తెలియని సాధువు ఆత్మహత్య - కడప జిల్లా తాజా క్రైం వార్తలు
అట్లూరులో ఓ సాధువు బలవన్మరణం చెందాడు. క్రాస్ రోడ్డు అయ్యప్ప దేవస్థానం వద్దనున్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
గుర్తు తెలియని సాధువు ఆత్మహత్య