ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తీవ్ర మనస్తాపంతో పూజారి ఆత్మహత్యాయత్నం

గుడిలో ఆభరణాలు చోరీ జరిగితే అక్కడి పూజారిని విచారణకు పిలిచారు పోలీసులు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ పూజారి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసుల వేధిపులతో తీవ్ర మనస్తాపం చెంది పూజారి ఆత్మహత్యాయత్నం

By

Published : Sep 5, 2019, 11:52 PM IST

పోలీసుల వేధిపులతో తీవ్ర మనస్తాపం చెంది పూజారి ఆత్మహత్యాయత్నం

క‌డ‌ప జిల్లా ఎర్ర‌గుంట్ల మండ‌లం గోపులాపురం గ్రామానికి చెందిన పూజారి వెంక‌ట రాముడు విషం తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. గోపులాపురం గ్రామ స‌మీపంలో ఉన్న దుర్గ‌మ్మ ఆల‌యంలో రెండు రోజుల క్రితం వెండి ఆభ‌ర‌ణాలు చోరీకి గుర‌వగా..గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆల‌యంలోకి ప్ర‌వేశించి ఆభ‌ర‌ణాలు అప‌హ‌రించారు. ఇందులో భాగంగా విచార‌ణ నిమిత్తం ఆల‌య పూజారి వెంకటరాముడును క‌ల‌మ‌ల్ల పోలీసులు స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకట రాముడు గుడి ద‌గ్గ‌రికు వెళ్లి విషం తాగారు. విష‌యాన్ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు, గ్రామ‌స్తులు హుటాహుటిన ప్రొద్దుటూరులోని ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులే త‌న తండ్రిని వేధించి ఉంటార‌ని ..అందువలనే మ‌న‌స్థాపం చెంది ఇలా ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డాడ‌ని బాధితుడి కుమారుడు ఎల్లాల్ ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details