రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు రాష్ట్ర ప్రెస్ అకాడమీ వివిధ విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కడప యోగివేమన విశ్వవిద్యాలయంతో ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, యోగివేమన విశ్వవిద్యాలయం రిజిస్టార్ రాఘవ ప్రసాద్ ఆధ్వర్యంలో అధ్యాపక ఒప్పందం ఎంవోయూ కుదుర్చుకున్నారు. విశ్వవిద్యాలయంలో జర్నలిజం కోర్సు చేయాలనుకునే విద్యార్థులకు ప్రెస్ అకాడమీ ఫీజులో కొంత రాయితీని భరిస్తుందని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల సందర్భంగా జర్నలిజం కోర్సులు చేయడానికి వీలు కలుగుతుందన్నారు.
యోగివేమన విశ్వవిద్యాలయంతో ఎంవోయూ కుదుర్చుకున్న ప్రెస్ అకాడమీ - కడప జిల్లా తాజా వార్తలు
జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు రాష్ట్ర ప్రెస్ అకాడమీ పలు విశ్వవిద్యాలయాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా కడప యోగివేమన విశ్వవిద్యాలయంతో ఒప్పందం కుదుర్చుకుంది.
Press Academy