కడప జిల్లా బద్వేల్లో హృదయ విదారక ఘటన జరిగింది. బద్వేల్‌కు చెందిన సావిత్రి పురిటినొప్పులతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. కాన్పు చేసేందుకని వైద్యులు లోపలికి తీసుకెళ్లారు. అయితే ఏమైందో తెలియదుకానీ.. బిడ్డ చనిపోయిందన్న వార్త బయటకు వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయిందంటూ సావిత్రి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఈ ఘటనలో మరో విషాదం ఏంటంటే.. తల్లి కూడా చనిపోయింది. ఆనందంగా వస్తారనుకున్న తల్లీబిడ్డ.. ఇలా విగతజీవిగా తిరిగిరావడంపై కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
తల్లీబిడ్డా ఆనందంగా వస్తారనుకుంటే...! - బద్వేల్లో ప్రైవేటు ఆసుపత్రిలో గర్భిణీ మృతి
ఆమె.. ఇంకొన్ని గంటల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సింది. నిండు గర్భంతో.. పురిటినొప్పులతో.. రాబోయే బిడ్డను తలుచుకుంటూ.. ఆసుపత్రిలో చేరింది. బయట ఆమె కుటుంబసభ్యులు, బంధువులంతా రాబోయే పాపాయి కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తు కూర్చున్నారు. అంతలోనే.. ఆసుపత్రి లోపలి నుంచి వార్త వచ్చింది.. బిడ్డ పుట్టిందని కాదు.. మరి ఏమని?
బద్వేల్లో గర్భిణీ మృతి
Last Updated : Mar 17, 2020, 11:42 AM IST