ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాన్పు చేసేదెవరు..? - లాక్​డౌన్​తో కష్టాలు పడుతున్న గర్భిణులు

లాక్​డౌన్​తో తల్లికాబోయే వారికి ప్రసవ కష్టాలు తప్పటం లేదు. గర్భిణులు పుట్టింటికి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉంటున్న గర్భిణులకు తోడుగా వెళ్లేందుకు తల్లిదండ్రులకు అనుమతుల్లేక కష్టాలు పడుతున్నారు.

lock down effect on pregnant
లాక్​డౌన్​తో ఇబ్బందులు పడతున్న గర్భిణులు

By

Published : May 24, 2020, 7:41 AM IST

కడప జిల్లాకు చెందిన దంపతులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమె గర్భిణి కావడంతో ఏప్రిల్‌లో ప్రసవ తేదీని వైద్యులు ముందే తెలిపారు. కాన్పు అయ్యాక అమ్మాయిని కడపకు తీసుకురావాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. ఇంతలో లాక్‌డౌన్‌. వారు అక్కడికి వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది.

  • ఏపీకి చెందిన ఓ జంట తమిళనాడులోని వేలూరులో ఉంటున్నారు. ఆమె ప్రస్తుతం గర్భిణి కావడంతో తల్లిదండ్రులు వెళ్లి తాడేపల్లిగూడెం తీసుకురావాలనుకుంటున్నారు. కుదరడం లేదు.

అమ్మాయికి నెలలు నిండుతున్నాయంటేనే తల్లిదండ్రులు, అత్తమామలు దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటారు. కాన్పు అయ్యాక పుట్టిన బిడ్డకు స్నానం మొదలుకొని ఆలనాపాలనా అన్నీ ఇంట్లో పెద్దలే చేస్తారు. కరోనా వల్ల రాకపోకలపై ఆంక్షల నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారికి కష్టాలు మొదలయ్యాయి. అమ్మగారింటికి వెళ్లాలనుకునే గర్భిణులు, ఆమె వద్దకే వెళ్లి తోడుగా ఉండాలనుకునే తల్లిదండ్రులకు ప్రయాణ అనుమతులు లభించడం లేదు.

గర్భిణులకు క్వారంటైన్‌ ఉండదు

పక్క రాష్ట్రం నుంచి గర్భిణులు ఎవరైనా మన రాష్ట్రంలో సొంతింటికి రావాలనుకుంటే ప్రత్యేక కేసుగా పరిగణించి అనుమతిస్తామని కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులు చెబుతున్నారు. వారికి పరీక్ష చేసి నెగెటివ్‌ వస్తే ఇంటి వద్దే క్వారంటైన్‌లో జాగ్రత్తగా ఉంటే చాలని చెబుతున్నారు. మరోవైపు అమ్మాయికి తోడుగా వెళ్లాల్సిఉందని కొందరు దరఖాస్తు చేసుకొని పొందే పాస్‌లు దుర్వినియోగమవుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ప్రవాసాంధ్రుల ఇక్కట్లు అన్నీఇన్నీ కావు

  • ప్రవాసాంధ్రుల జంట లండన్‌లో ఉద్యోగం చేస్తోంది. వీరిలో ఆమె గర్భిణి. జులైలో డెలివరీ కానుంది. కాకినాడకు చెందిన ఆమె తల్లిదండ్రులు ఏప్రిల్‌లోనే లండన్‌ వెళ్లి తోడుగా ఉండాలని భావించారు. జులైనాటికి వెళ్లకపోతే.. తమ కుమార్తె ఇబ్బందులు పడుతుందని ఆవేదన చెందుతున్నారు.
  • వివిధ దేశాల్లో ఉన్న వారిది మరో కష్టం. అక్కడ నెలలు నిండి కాన్పు తేదీ దగ్గరపడుతున్న అమ్మాయిల వద్దకు వెళ్లాలని తల్లిదండ్రులు కొన్నినెలల ముందే ప్రణాళికలు వేసుకున్నారు. విమాన సర్వీసుల్లేక కుదరడంలేదు.

ABOUT THE AUTHOR

...view details