ఇదీ చూడండి:
గర్భిణీ మృతిపై బంధువుల ఆందోళన - crime news at kadapa
కడప జిల్లాలోని రైల్వేకోడూరులోని అమ్మ ఆస్పత్రిలో ఓ గర్భిణీ మృతి చెందిన ఘటన వివాదానికి దారి తీసింది. గర్భిణీ తులసమ్మకు రక్తపోటు తగ్గడం వల్ల తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. అయితే ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పారు.
ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న బంధువులు