ఆంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ - ambulance team delivered to pregnant lady latest news
కడప జిల్లా రైల్వే కోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం 108లో గర్భిణీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆంబులెన్స్‌లో తరలిస్తున్న గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వాహనంలో పురుడు పోశారు.
![ఆంబులెన్స్‌లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన గర్భిణీ pregnant lady delivered in ambulance](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9274536-49-9274536-1603385647236.jpg)
కడప జిల్లా రైల్వే కోడూరు మండల పరిధిలోని జానకి పురానికి చెందిన లక్ష్మికి గురువారం పురిటి నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వచ్చారు. కడుపులో బిడ్డ ఆకారం పెద్దగా ఉందని వైద్యుల సలహాతో మహిళను తిరుపతి ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు 108 అంబులెన్స్ వాహనంలో తరలించారు. ఈ క్రమంలో అంబులెన్స్ కుక్కల దొడ్డి దాటగానే పురిటి నొప్పులు ఎక్కువ అవడంతో ఈఎంటీ ఉదయ్ భాస్కర్, పైలెట్ రాజశేఖర్, స్టాఫ్ నర్స్ మేరీ అంబులెన్స్ లోనే చికిత్స అందించి పురుడు పోశారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రభుత్వం ఆసుపత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది తెలిపారు.