ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజంపేటలో విద్యుత్ సంఘాల జేఏసీ ఆందోళన - power unions JAC protest news update

విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యం సాగతీత ధోరణిలో వ్యవహరిస్తోందని, అందుకే ఆందోళన చేయాల్సి వచ్చిందని విద్యుత్ జేఏసీ సంఘ నాయకులు పేర్కొన్నారు. రాజంపేట విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ నెల 24 వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు చేపడతామని, అప్పటికి యాజమాన్యం దిగిరాకపోతే దశలవారీ ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

power unions JAC concern
విద్యుత్ సంఘాల జేఏసీ ఆందోళన

By

Published : Oct 20, 2020, 11:54 AM IST


తాము ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ జేఏసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజన్ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. తొలుత విద్యుత్ అధికారి చంద్రశేఖరరావుకు వినతి పత్రం అందజేశారు. జేఏసీ కన్వీనర్ బాలాజీ మాట్లాడుతూ ఆర్​టీపిీపీ నెల్లూరు ధర్మల్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 2020 విద్యుత్ సవరణను రద్దు చేయాలని కేంద్రానికి రాష్ట్రం లేఖ రాయాలని కోరారు. కరోనాతో మృతి చెందిన విద్యుత్ కార్మికుల కుటుంబాలకు 50 లక్షల రూపాయల బీమా పరిహారం చెల్లించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details