కడప జిల్లా మైదుకూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పురపాలక కమిషనర్ రామకృష్ణ ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పురపాలక సిబ్బంది సచివాలయ వాలంటీర్లతో కలిసి పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
మైదుకూరులో పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులు - మైదుకూరులో పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులు
తెలుగు వారి కోసం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసి.. తన ప్రాణాలనే పణంగా పెట్టారు. తెలుగు జాతి సగర్వంగా తలెత్తుకు తిరిగేలా చేసిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు. శ్రీరాములు వర్థంతి సందర్భంగా మైదుకూరు పురపాలక కమిషనర్ రామకృష్ణ ఘనంగా నివాళులర్పించారు.

మైదుకూరులో పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులు
మైదుకూరులో పొట్టి శ్రీరాములుకు ఘనంగా నివాళులు
Last Updated : Dec 26, 2019, 3:09 PM IST