కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అత్యవసర వైద్యం కోసం తెరిచిన ఆసుపత్రిని సీఐ మూసివేశారు. ఆసుపత్రి తెరిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చెశారు. రోగుల ఒత్తిడి మేరకే అత్యవసర చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. సరైన వైద్యం అందక ఇద్దరు శిశువులు గర్భంలోనే చనిపోయారని వైద్యురాలు పద్మలత ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసరం అయితే తప్ప మిగిలన సమయంలో వైద్యం అందిచడం లేదని, పోలీసులు దాన్ని గమనించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బాదాకరమన్నారు.
పోలీసుల అత్యుత్సాహం.. వైద్యుల ఆగ్రహం - lockdown in prodhutur
కడప జిల్లా ప్రొద్దుటూరులో అత్యవసర సేవల కోసం తెరిచిన ఆసుపత్రిని మూసివేయాలని పోలీసులు హెచ్చరించారు. అత్యవసర అయితే తప్ప వైద్యం అందిచడం లేదని వైద్యులు అన్నారు.

పోలీసుల అత్యత్సాహం.. వైద్యుల ఆగ్రహం