ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజకీయ పార్టీల సమావేశంలో గందరగోళం - కడపలో రాజకీయ పార్టీల సమావేశంలో గందరగోళం

కడప జిల్లాలో రాజకీయ పార్టీల సమావేశం గందరగోళంగా మారింది. పురపాలక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల కేటాయింపు అంశాలపై సమావేశం నిర్వహించగా... ఏ పార్టీ నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో తెలపాలని తెదేపా కోరింది. అభ్యంతరాల వివరాలను సరిగా చెప్పకపోవటంతో ప్రతిపక్షాలు అసహనం వ్యక్తం చేశాయి.

political-meeting-in-kadapa-rajampet
political-meeting-in-kadapa-rajampet

By

Published : Feb 8, 2020, 11:48 AM IST

కడపలో రాజకీయ పార్టీల సమావేశంలో గందరగోళం
కడప జిల్లా రాజంపేట పురపాలక కార్యాలయంలో పురపాలక పోలింగ్ కేంద్రాలపై జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో గందరగోళం నెలకొంది. పురపాలక పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల కేటాయింపు అంశాలపై ఏ పార్టీ నుంచి ఎన్ని అభ్యంతరాలు వచ్చాయో తెలపాలంటూ మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బత్యాల చెంగల్రాయుడు డిమాండ్ చేశారు. అభ్యంతరాల గడువు ముగిసేలోపు వచ్చిన దరఖాస్తుల వివరాలను తెలియజేయాలని పట్టుబట్టారు.

తాను కలెక్టర్ సమావేశానికి వెళ్లడం కారణంగా అభ్యంతరాల దరఖాస్తులను చూడలేదని, వాటిని పరిశీలించి చెబుతానని పురపాలక కమిషనర్ రాజశేఖర్ తెలిపారు. ఈ సమాధానంపై తెదేపా, వామపక్షాలు, జనసేన నాయకులు అసహనం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓట్ల కేటాయింపు విషయంలో అవకతవకలు జరిగితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెంగల్రాయుడు తెలిపారు. రాజకీయ పార్టీల సమావేశం పెట్టి సరైన సమాచారం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ సభ నుంచి తెదేపా, వామపక్ష, జనసేన నాయకులు వెళ్లిపోయారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details