కడప జిల్లా పొద్దుటూరు క్రికెట్ పందేలకు అడ్డాగా మారింది. ప్రధాన బుకీలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గోవాలో స్థావరాల ఏర్పాటు చేసుకుని క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో బుకీలు ఎక్కడ పట్టుబడినా చివరకు ప్రొద్దుటూరుకు చెందిన పందెంరాయుళ్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడుతోంది.
క్రికెట్ బుకీల కోసం పోలీసుల వేట - ప్రొద్దుటూరులో క్రికెట్ బుక్కీ
కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన క్రికెట్ బుకీలను పట్టుకునేందుకు కడప పోలీసులు చర్యలు ప్రారంభించారు. వారికోసం బెంగళూరు వెళ్లినట్లు సమాచారం
![క్రికెట్ బుకీల కోసం పోలీసుల వేట cricket bookies at prodhutur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9052779-924-9052779-1601876224114.jpg)
ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి కడప పోలీసులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. అతను ప్రొద్దుటూరుకు చెందిన క్రికెట్ బుకీల పేర్లు చెప్పడంతో మూడు రోజుల క్రితం మట్టి మసీదువీధికి చెందిన ప్రధాన బుకీ దగ్గర పనిచేసే సహాయకుడిని, అలాగే జిన్నా రోడ్డుకు చెందిన మరో ప్రధాన బుకీ సహాయకుడిని కడప పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. బెంగుళూరులో ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన ప్రధాన బుకీలను పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించిన కడప పోలీసులు.. వారి కోసం ఇప్పటికే బెంగళూరు వెళ్ళినట్లు విశ్వసనీయ సమాచారం.
ఇదీ చదవండి: పోలీసుల ఉదాసీనత వల్లే రాజ్యాంగ ఉల్లంఘనలు: చంద్రబాబు