తెలంగాణ నుంచి కడపజిల్లాకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను కడప పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి బిస్కెట్లలోడుతో వస్తున్న ఐషర్ వాహనంలో 478 మాన్సన్ హౌస్ బాటిళ్లను తీసుకొస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వినాయకనగర్‌లో టూటౌన్ పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.... ఐషర్ వాహనంలో బిస్కెట్ల మాటును ఉన్న మద్యం లభ్యమైంది. వాటి విలువ దాదాపు 10 లక్షల రూపాయలు ఉంటుందని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. ఐషర్ వాహనం మరో 8 లక్షల రూపాయలు ఉంటుందని... మద్యం, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. కడప నగరానికి చెందిన శేఖర్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ నుంచి మద్యం తీసుకురావాలని చెప్పినట్లు డ్రైవర్ చంద్రమోహన్ రెడ్డి పోలీసులకు తెలిపాడు. అక్రమ మద్యంపై నిఘా ముమ్మరం చేయడంతో పాటు జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
కడపజిల్లాలో 10 లక్షల విలువైన తెలంగాణ మద్యం పట్టివేత - కడపజిల్లా తాజా వార్తలు
కడపజిల్లాకు అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ మద్యం విలువ రూ. 10లక్షలు ఉంటుందని వారు తెలిపారు.
కడపజిల్లాలో తెలంగాణ మద్యం పట్టివేత