కడప జిల్లా రాజంపేటలో పెద్దమొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కోటిరూపాయలు విలువచేసే 52 రెండు కిలోల గంజాయి స్వాధీనపరచుకొని ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారిలో అంతర్రాష్ట్ర నిందితులు ఉండగా... వీరితో పాటు మరో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. రాజంపేట సమీపంలోని అన్నమాచార్య కళాశాల వెనుకవైపు ఐదుగురు వ్యక్తులు, మరో ముగ్గురు మహిళలు కలిసి గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి, సీఐ నరేందర్ రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి వారిపై దాడులు చేశారు. వారి నుంచి సుమారు కోటి రూపాయలు విలువచేసే 52 కిలోల గంజాయి ప్యాకెట్లు స్వాధీనపర్చుకున్నారు. ఏడు చరవాణిలు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారిస్తే విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలలో గంజాయి కొనుగోలు చేసి అక్కడి నుంచి వాహనాల ద్వారా ఏపీ, ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేసేవారిని చెప్పారు. జిల్లాలలో ఏజెంట్ల ద్వారా గంజాయి విక్రయిస్తున్నారని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి సరఫరా పై నిఘా ఉంచామని చెప్పారు.
రాజంపేటలో కోటి రూపాయలు విలువైన గంజాయి పట్టివేత - ganja at rajampeta updates
కడప జిల్లా రాజంపేటలో కోటి రూపాయలు విలువ చేసే 52 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను పట్టుకున్నారు. ముగ్గురు మహిళలను కూడా వారు అదుపులోకి తీసుకున్నారు.
రాజంపేటలో కోటి రూపాయలు విలువ చేసే 52 కిలోల గంజాయి పట్టివేత