ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Police Suspended for Vinayaka Immersion Fire Accident: వినాయక నిమజ్జన ఊరేగింపులో అగ్ని ప్రమాదం.. పోలీసులపై సస్పెన్షన్ వేటు - Ganapati Immersion

Police Suspended for Vinayaka Immersion Fire Accident: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో వినాయక నిమజ్జనంలో జరిగిన అపశృతికి.. పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఉత్సవ ఊరేగింపులో.. అగ్ని ప్రమాదం పోలీసుల నిర్లక్ష్యం వలనే సంభవించిందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Police_Suspended_for_Vinayaka_Immersion_Fire_Accident
Police_Suspended_for_Vinayaka_Immersion_Fire_Accident

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2023, 3:04 PM IST

Updated : Oct 2, 2023, 3:35 PM IST

Police Suspended for Vinayaka Immersion Fire Accident: వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలో వినాయక నిమజ్జనంలో జరిగిన అపశృతికి.. పోలీసులు సస్పెండ్ అయ్యారు. ఎర్రగుంట్లలో శనివారం రాత్రి గ్రామ పెద్దలు గణేష్ నిమజ్జన శోభయాత్రను చేపట్టారు. అయితే పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లుగా.. వినాయక నిమజ్జన సమయంలో జరుగుతున్న ఉత్సవ ఊరేగింపులో కాంతారా సినిమా తరహాలో.. చుట్టూ పెట్రోల్ పోసి నిప్పు పెట్టి కాంతారా వేషధారణతో యువకులు డ్యాన్సులు చేశారు. ఈ నృత్యాన్ని వీక్షించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

Tragedy in Immersion విషాదాన్ని నింపిన వినాయక నిమజ్జనం

ఆ సమయంలో కమిటీ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారి మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో చుట్టూ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ మంటల్లో ఐదుగురు చిన్నారులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు హుటాహుటిన ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయలయ్యాయని వైద్యులు తెలిపారు.

Maternal Uncle Nephew Died In Ganesh Immersion Video : గణేశ్​ నిమజ్జనంలో విషాదం.. నీట మునిగి మామాఅల్లుళ్లు మృతి

కాగా పోలీసు భద్రతా వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపించారు. పెట్రోల్ క్యాన్ పట్టుకుని జనం మధ్యలో వినాయక కమిటీ సభ్యులు తిరుగుతున్నా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించారని చెబుతున్నారు. కాగా ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినవినాయకకమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పలువురు కోరుతున్నారు.

వినాయక నిమజ్జనంలో అపశృతి... వాటర్‌గండిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఆ సమయంలో అక్కడ యువకులు పెట్రోల్ డబ్బాలు తీసుకెళ్తుండగా పోలీసులు వారిని నివారించలేకపోయారు. కాగా.. పోలీసుల నిర్లక్ష్యం వలనే ఈ ప్రమాదం సంభవించిందని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు నిర్వహించి బాధ్యులైన సీఐ, ఇద్దరు ఎస్సైలకు ఛార్జి మెమోలు అందించి.. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, హోంగార్డులను సస్పెండ్ చేశారు. ఒకేసారి ఇంతమంది పోలీసులపై చర్యలు తీసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Uyyala Ganapati Immersion నిమజ్జన ఊరేగింపులో ఈ బుజ్జి వినాయక ప్రతిమలు తీరే వేరయా! ఆకట్టుకున్న బుల్లి ట్రాలీ..

"వినాయక నిమజ్జనం సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అయితే ఆ సమయంలో అక్కడ యువకులు పెట్రోల్ డబ్బాలు తీసుకెళ్తుండగా పోలీసులు వారిని నివారించలేకపోయారు. పోలీసు భద్రతా వైఫల్యం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. పెట్రోల్ క్యాన్ పట్టుకొని వినాయక కమిటీ సభ్యులు.. జనం మధ్యలో తిరుగుతున్నా.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకొని.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉంది." - స్థానికులు

Last Updated : Oct 2, 2023, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details