ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Venkata Sanjana Kidnap case: బద్వేలు విద్యార్థిని కిడ్నాప్​ కేసు సుఖాంతం - కడప జిల్లా తాజా వార్తలు

Venkata Sanjana Kidnap case: వైఎస్సార్‌ జిల్లా బద్వేలులో విద్యార్థిని వెంకట సంజన అపహరణ కేసును పోలీసులు ఛేదించారు. బాలికను అపహరించిన మహిళ.. విజయవాడకు తీసుకెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా పోలీసులు గుర్తించారు. బాలికను కాపాడి బద్వేలు స్టేషన్‌కు తీసుకొచ్చారు. విచారణలో భాగంగా ముఠాలోని సభ్యుల గురించి ఆరా తీస్తున్నారు.

Venkata Sanjana Kidnap case
అపహరణ కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Oct 24, 2022, 10:42 AM IST

Venkata Sanjana Kidnap case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిస్సింగ్ కేసులను పోలీసులు సవాల్​గా తీసుకున్నారు. ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. ఈనెల 14వ తేదీన కడప జిల్లా బద్వేలు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని వెంకట సంజన అదృశ్యమైందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసిన పోలీసులు.. వెంకట సంజన అపహరణకు గురైనట్లు గుర్తించారు. బద్వేలు నుంచి నెల్లూరు ఆ తర్వాత విజయవాడకు ఓ మహిళ అపహరించి తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీల ద్వారా గుర్తించి పోలీసులు కేసును పురోగతి సాధించారు. విజయవాడలో మహిళ చర నుంచి విద్యార్థిని కాపాడి మహిళలతో పాటు విద్యార్థిని సంజనను ప్రత్యేక వాహనంలో బద్వేలుకు సురక్షితంగా తీసుకొచ్చారు. ఈ కేసులో మరికొందరు మహిళల ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details