కడప శివారులోని రింగు రోడ్డు వద్ద అక్రమంగా తరలిస్తున్న 24 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ 9 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.
రాజంపేట బైపాస్ నుంచి రింగ్ రోడ్డుపై లారీ వెళ్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. లారీలో రేషన్ బియ్యన్ని గుర్తించారు. 450 బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.