అల్ప పీడనం వల్ల వారం రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల(AP RAINS LATEST NEWS) కారణంగా.. చెరువులు, వాగులు, వంకల్లో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం లింగాలలో ప్రవహిస్తున్న వాగులో ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు.
ద్విచక్రవాహనంపై వెళుతుండగా.. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఉన్న బ్రిడ్జిపై నుంచి ప్రమాదవశాత్తు కింద ఉన్న వాగులోకి జారి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. వెంటనే ఈ సమాచారాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్న ఎమ్మార్వో శేషారెడ్డి, ఎంపీడీవో సురేంద్ర నాథ్, ఎస్సై రుషీకేశవ రెడ్డి, పోలీసులు స్థానికుల సహకారంతో ఆ వ్యక్తిని కాపాడారు. తన ప్రాణాలు కాపాడిన అధికారులకు బాధితుడు ప్రతాపరెడ్డి కృతజ్ఞతలు తెలిపాడు.