కడప జిల్లా, దువ్వూరు మండలం ఇందిరమ్మ కాలనీలోని పాడుబడ్డ బావిలో 70 ఏళ్ల వృద్ధురాలు వెంకటమ్మ ప్రమాదవశాత్తు పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు. బావిలో వృద్దురాలు పడిపోయి ఉండటాన్ని ఒక మేకల పెంపకందారుడు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఎస్సైతో సహా సిబ్బంది బావి వద్దకు చేరుకున్నారు. మెట్లులేని 30 అడుగుల ఏటవాలుగా ఉన్న బావిలోకి తాళ్ల సహాయంతో దిగారు. అతికష్టం మీద వృద్ధురాలిని బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వృద్ధురాలిని చికిత్స కోసం 108లో ప్రోద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడిన వృద్దురాలు... కాపాడిన పోలీసులు - దువ్వూరులో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వృద్ధురాలు
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయిన 70 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన కడప జిల్లా దువ్వూరు మండలంలో జరిగింది. గాయపడిన వెంకటమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వృద్ధరాలిని పైకి తీసుకువస్తున్న పోలీసులు