కడప జిల్లా కాశినాయన మండలంలో రెండు రోజుల క్రితం గ్రామసచివాలయాల శంకుస్థాపనకు వచ్చిన వైకాపా ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని గ్రామస్థులు అడ్డుకున్న ఘటనలో40 మందిపై కేసులు నమోదయ్యాయి. నరసాపురం, రంపాడు గ్రామాలకు చెందిన వారిపై కేసు పెట్టారు.
నరసాపురం గ్రామానికి వచ్చిన పోలీసులు... కేసు నమోదైన 22 మందిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీని అడ్డుకున్నది మగవారు కాదని... అంతా మహిళలు అని వాదించారు. మహిళలే స్వయంగా పోలీసు వాహనం ఎక్కి కూర్చున్నారు. 8 మంది మహిళలను స్టేషన్కు తీసుకెళ్లారు.