ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'బాధ్యతను విస్మరిస్తే చర్యలు తప్పవు' - corona news kadapa

కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. కానీ కొందరు తమ బాధ్యతను విస్మరించి మాస్కులు లేకుండా సంచరిస్తున్నారు. అలాంటి వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది.

Police  registered cases against people wearing masks throughout Kadapa district
'బాధ్యతను విస్మరిస్తే చర్యలు తప్పవు'

By

Published : Jun 25, 2020, 7:53 AM IST

కడప జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్​స్టేషన్​ల పరిధిలో కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. కడప, మైదుకూరు, పులివెందుల, ప్రోద్దుటూరు, రాజంపేట, జమ్మలమడుగు సబ్ డివిజన్​ల పరిధిలో మెుత్తం 915 కేసులు నమోదు చేసి... రూ.2,11,330 జరిమానా విధించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు తమవంతు బాధ్యతను గుర్తించి పోలీస్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు. ఆరోగ్య సంరక్షణ ప్రజల చేతుల్లోనే ఉందని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. ఎదుటివారితో మాట్లాడే సమయంలో కచ్చితంగా భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇది చదవండి: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం.. చీకటైపోయిన జీవితాలు

ABOUT THE AUTHOR

...view details