Case on constable: కానిస్టేబుల్‌పై కేసు నమోదు... కారణం అదే..! - వైయఎస్ఆర్ జిల్లా తాజా వార్తలు
Case registered on constable: వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో యువతి నుంచి రూ.5 లక్షలు తీసుకున్నట్లు కానిస్టేబుల్ సుమన్‌పై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోపణల నేపథ్యంలో కానిస్టేబుల్‌ను అధికారులు రిమాండ్‌కు పంపారు.
Case registered on constable: వైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో కానిస్టేబుల్ సుమన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన నుంచి రూ.5 లక్షలు తీసుకున్న కానిస్టేబుల్ సుమన్... పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. దర్యాప్తు చేసిన అధికారులు... ప్రొద్దుటూరు మూడో పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సుమన్‌పై కేసు నమోదు చేసి రిమాండుకు పంపినట్లు సీఐ ఆనందరావు తెలిపారు. కానిస్టేబుల్ సుమన్‌కు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: పాఠశాల నుంచి వెళ్తున్న.. బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం