రైల్వేకోడూరు నియోజకవర్గంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు చేస్తున్నారు. రైల్వే కోడూరు మండలం కన్నె గుంట ఎస్. టి కాలనీ సమీపంలోని తునికొండలో నాటు సారా కాచేందుకు సిద్ధంచేసిన 1650 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని అధికారులు తెలిపారు.
1650 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నాటు సారా స్థావరాలపై దాడులు
కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కు పాదం మోపుతున్నారు. నాటు సారా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలలో సభలు ఏర్పాటు చేసి నాటు సారా కాసే వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిన వారు మారడం లేదు.
1650 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం