కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో మట్కా స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం పదమూడు మందిని అరెస్టు చేసి రూ.91,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ఎస్ ఉప్పలపాడు గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకుని 40 వేల రూపాయలు, జమ్మలమడుగు పాఠశాల మైదానంలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.51 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వారి నుంచి మట్కా చీటీలు, చరవాణీలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు.
జమ్మలమడుగులో మట్కా స్థావరాలపై పోలీసుల దాడులు - police raids on jammalamadugu
కడప జిల్లా జమ్మలమడుగు మండలంలో మట్కా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పదమూడు మందిని అరెస్ట్ చేసి రూ.91,000 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల అదుపులో నిందితులు