కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఇసుక, మద్యం అక్రమ రవాణాపై బుధవారం పోలీసు అధికారులు, సిబ్బంది మెరుపు దాడులు నిర్వహించారు. నాటుసారా స్థావరాలపై గుర్తించి 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అలాగే 20.6 లీటర్ల నాటుసారాను కాస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి పులివెందుల పోలీస్ స్టేషన్ పరిధిలో మొత్తం 850 టన్నుల మూడు భారీ డంపులను స్వాధీనం చేసుకున్నారు. 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ట్రాక్టర్‌తో పాటుగా 11 ఎడ్ల బండ్లతో కలిపి మొత్తం 863 టన్నుల ఇసుకను పోలీసులు సీజ్ చేశారు.
జిల్లాలో అక్రమ మద్యం, ఇసుక రవాణాపై పోలీసు అధికారుల దాడులు - kadapa district latest news
జిల్లాలో మద్యం, ఇసుక అక్రమ రవాణాపై బుధవారం పోలీసులు అధికారులు దాడులు చేశారు. ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు.
కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్