కడప జిల్లా బద్వేలు మండలం కొంగలవీడు గ్రామ సమీపంలో ఉన్న సగిలేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా ఇసుక తరలిస్తోన్న ఇద్దరి అరెస్టు - కడప జిల్లా వార్తలు
ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కొందరు అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నారు. కడప జిల్లాలోని సగిలేరులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి.. వారి వద్ద నుంచి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు.. ఇద్దరిపై కేసు నమోదు